
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి దూరం లేదు.. మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది: క్రిష్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ చిత్రం మొదట దర్శకుడు క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అనంతరం సినిమాను పూర్తి చేసిన బాధ్యతను జ్యోతికృష్ణ భుజాన వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై స్పందిస్తూ క్రిష్ ఓ మీడిAయా సంస్థతో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
Details
ఇందుకు కారణాలు త్వరలో బయటపడతాయి: క్రిష్
తాను చిత్రం మధ్యలో నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. ఇందుకు గల కారణాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయని క్రిష్ పేర్కొన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 'నాకు, పవన్‌కి మధ్యలో క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయన్ను తీసుకొని మళ్లీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్రిష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇంకా 'హరి హర వీరమల్లు' విడుదలకు ముందు పవన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ క్రిష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 'ఈ చిత్రాన్ని పూర్తిచేయడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం, అలాగే ఏఎం రత్నం కూడా అని పోస్ట్‌లో ఆయన వివరించారు.