Karan johar: రాజమౌళి సినిమాల్లో లాజిక్ లేదు.. కరుణ్ జోహార్ హాట్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు నిర్మించి, భారీ విజయాలను సాధించిన కరణ్, సినీ ప్రపంచంలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.
ఇటీవల, తన సినిమాల గురించి మాట్లాడుతూ, టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ రాజమౌళి సినిమాలపై చాలా వైరల్ కామెంట్స్ చేశాడు.
మన సినిమాపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ గురించి పట్టించుకోరని, ఉదాహరణకి, రాజమౌళి సినిమాల్లో ప్రేక్షకులు ఎప్పుడూ లాజిక్ గురించి చర్చించరని కరణ్ జోహర్ పేర్కొన్నారు.
Details
సినిమా విజయం నమ్మకం మీద ఆధారపడుతుంది
వారు కథపై పూర్తి నమ్మకం ఉంచుతారని, రాజమౌళి తన సినిమాల్లో ఎలాంటి సన్నివేశాలను చూపించినా, ప్రేక్షకులు వాటిని అంగీకరిస్తారని తెలిపారు.
'ఆర్ఆర్ఆర్', 'యానిమల్', 'గదర్' వంటి సినిమాలు ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తాయని, 'గదర్ 2'లో సన్నీ దేవోల్ 1000 మందిని కొడతారని, అది నిజం కాదా అని ఎవరూ ప్రశ్నించరన్నారు.
ప్రేక్షకులు నమ్మడంతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిందని కరణ్ జోహర్ చెప్పుకొచ్చారు.
సినిమా విజయం అన్నది పూర్తి విశ్వాసం మీద ఆధారపడుతుందని, లాజిక్ గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.