
Dhanush: ఇడ్లీ కోసం కూడా డబ్బులు లేవు.. హీరో ధనుష్ ఎమోషనల్!
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇడ్లీ కొట్టు' (Idly Kottu) అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతన అనుభవాలను గుర్తుచేశారు. 'నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తినాలనిపించేది, కానీ అప్పుడేం డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నా, చిన్నతనంలో ఇడ్లీ తినేప్పుడు ఉన్న ఆనందం, రుచి రెస్టారెంట్లలో లేదు. ఈ సినిమా నిజజీవితాన్ని ఆధారంగా రూపొందించబడింది. చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ధనుష్ పేర్కొన్నారు. ట్రోల్స్ విషయానికొస్తే, 'హేటర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు. కొందరు 30 మంది ఒక టీమ్‌గా ఏర్పడి 300 ఫేక్ ఐడీలను సృష్టించి హీరోలపై ద్వేషం వ్యక్తం చేయవచ్చును.
Details
మరో కొత్త సినిమాను ప్రకటించిన ధనుష్
కానీ ఆ 30 మంది కూడా సినిమా చూస్తారు. బయట కనిపించే దానికి, నిజానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. అదే వేదికపై ధనుష్ మరో సినిమాను ప్రకటించారు. త్వరలోనే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై' సీక్వెల్‌లో నటించనున్నారు. 'ఇడ్లీ కొట్టు'లో ధనుష్ సరసన నిత్యామేనన్ (Nithya Menon) నటిస్తున్నారు. విజయవంతమైన 'తిరు' తర్వాత వీరి రెండవ కలయిక. ఇందులో ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. సినిమా గ్రామీణ ప్రాంత నేపథ్యంతో రూపొందించారు.