
Sumanth: మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు సుమంత్, నటి మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్‌మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే తాజాగా సుమంత్ ఈ ప్రచారాలపై స్పందించారు.
తన తాజా చిత్రం 'అనగనగా' ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన సుమంత్, ఈ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 'సోషల్‌మీడియాను నేను పెద్దగా ఉపయోగించను.
అందుకే ఇలాంటి వార్తలు ముందుగా నన్ను చేరవు. వైరల్ అయిన ఫొటో కూడా మేము 'సీతారామం' సినిమా ప్రమోషన్స్ సమయంలో దిగినదేనని వివరించారు.
Details
పెళ్లి చేసుకోవాలని లేదు
ఇక పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సుమంత్, మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశం లేదన్నారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సుమంత్ గతంలో నటి కీర్తి రెడ్డిను వివాహం చేసుకున్నారు.
అయితే ఆ బంధం కొంతకాలం తరువాత విడాకులతో ముగిసింది. ఇప్పుడు సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అనగనగా' విడుదలకు సిద్ధమవుతోంది.
ఇది ఈటీవీ ఒరిజినల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించగా, సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు.
Details
ఉపాధ్యాయుడి పాత్రలో సుమంత్
ఈ సినిమాలో సుమంత్ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు.
నేటి విద్యా విధానంలో పిల్లలపై ఉన్న మార్కుల ఒత్తిడిని, చదువు పట్ల దృక్పథాన్ని సమీక్షించేలా ఈ సినిమా సాగనుంది.
కాన్సెప్ట్ బాగా అర్థమైతే మార్కులు తానే వస్తాయనే నమ్మకంతో సాగిన కథలో.. ఆ ఉపాధ్యాయుడి ప్రయత్నం ఎంతవరకు ఫలించిందన్నదే కథా నేపథ్యం.
ఈ మూవీ టీజర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది.