Suriya Father: ఈ కోలీవుడ్ స్టార్ హీరోల తండ్రి ఒక్కప్పుడు నటించిన సీరియల్స్ ఇవే.. ఇవి తెలుగులోనూ పెద్ద హిట్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ చిత్రసీమలో అగ్రశ్రేణి కథానాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య, కార్తీ ఇద్దరూ వారి నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
పాన్-ఇండియన్ సినిమాల ద్వారా సూర్య తన ప్రతిభను ప్రదర్శిస్తుండగా, విభిన్న కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కార్తీ వరుస విజయాలను అందుకుంటున్నాడు.
వీరి తండ్రి శివకుమార్ 1970-80 దశకాల్లో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు.
వివరాలు
200 సినిమాలు…
నలభై ఏళ్లకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో శివకుమార్ 200కు పైగా తమిళ చిత్రాల్లో నటించారు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నారు.
అగ్రశ్రేణి దర్శకులు అయిన కే. బాలచందర్, ఐవి. శశి, మణివణ్ణన్ వంటి ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ముఖ్యంగా కే. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సింధు భైరవి, అగ్ని సాక్షి చిత్రాల్లో ఆయన నటన విశేషంగా ప్రశంసలు అందుకుంది.
వివరాలు
బుల్లితెరలో ప్రవేశం…
సినిమాలతోనే కాకుండా టెలివిజన్ సీరియల్స్ ద్వారా కూడా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.
ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్తి, అన్నమలై వంటి సీరియల్స్ తెలుగులోకి అనువాదమయ్యాయి.
పిన్ని సీరియల్...
తమిళంలో ప్రసారమైన చిత్తి సీరియల్ తెలుగులో పిన్ని పేరుతో జెమిని టీవీలో ప్రసారమైంది.
1999 నుంచి 2001 వరకు ప్రసారమైన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానం సంపాదించుకుంది.
"కృష్ణమ్మకు గోదారికి తోడేవరమ్మ" అంటూ ఈ సీరియల్ టైటిల్ సాంగ్ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది.
పిన్ని సీరియల్‌లో శివకుమార్ రాము అలియాస్ రామచంద్ర అనే పాత్రలో నటించారు.
వివరాలు
శివయ్య సీరియల్…
రాధిక శరత్‌కుమార్ రెండో భర్తగా, ఆమెకు సహాయంగా ఉండే ఓ సానుకూల వ్యక్తిగా ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సీరియల్ ద్వారా శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
పిన్ని సీరియల్ తర్వాత, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అన్నమలై సీరియల్‌లో శివకుమార్ టైటిల్ పాత్రలో కనిపించారు.
ఈ సీరియల్ తెలుగులో శివయ్య పేరుతో డబ్ చేయబడింది. 2002 నుండి 2005 వరకు జెమిని టీవీలో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది.
అయితే, పిన్ని సీరియల్ ఎంతగా ప్రజాదరణ పొందిందో, అంత స్థాయిలో శివయ్య ఆకట్టుకోలేకపోయింది.