Page Loader
Web Series 2023 : 2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే!
2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే!

Web Series 2023 : 2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మధ్య ఓటిటి(OTT)లో రిలీజైన వెబ్ సిరీస్‌‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతివారం ఎన్నో వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయాయి. అలా ఈ ఏడాదిలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పలు వెబ్ సిరీస్ ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఫర్జి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ మొదటి సారిగా 'జర్జి' అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. రాజ్ డీకే ఈ మూవీకి దర్శకత్వం వహించగా, విజయ సేతుపతి, రాశీఖన్నా నటించారు. అధునాతన సాంకేతికతతో దొంగనోట్లను ఎలా ముద్రించి, విక్రయించాడో అన్న కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించారు.

Details

మొదటిసారి వెబ్ సిరీస్ లో అక్కినేని నాగ చైతన్య

దూత హీరో నాగ చైతన్య తొలిసారిగా 'దూత' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జర్నలిజం ఇతివృత్తంగా హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ పంచాయి. వ్యూహం ఈ మూవీని సరికొత్త కథాంశంతో శశికాంత్ శ్రీవైష్ణవ్ సీనపాటి తెరకెక్కించాడు. ఇందులో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, పావని గంగిరెడ్డి నటించారు. రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటనకు పలు పాత్రలను లింక్ చేస్తూ చివరిలో వాటిని రిలీవ్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇతరులకు హాని చేస్తే దాని ఫలితాలో ఎలాగైనా అనుభవించాల్సిందేనన్న అంశంతో ఈ సిరీస్‌ను రూపొందించారు.

Details

కెప్టెన్ బలరామ్ సింగ్ మోహతా కథతో తెరకెక్కిన 'పిప్పా'

దహాద్ ప్రేమించిన వ్యక్తితో ఇంటికి పారిపోయిన యువతి కథాంశంతో 'దహాద్' అనే వెబ్ సిరీస్‌ను తీశారు. ఈ కేసు విచారణలో ఎస్ఐ అంజలి భాటీ ఎదుర్కోన్న సవాళ్లను సరికొత్తగా చూపించారు. ఇందులో ఎస్ఐగా సోనాక్షి సిన్హా మెప్పించింది. ఈ సినిమాను కిమా కగ్టి, రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించారు. కుల వ్యవస్థ, ధనిక-పేద వర్గాల మధ్య తారతమ్యం వంటి అంశాలను తెరపై ఎంతో అద్భుతంగా చూపించారు. పిప్పా ఇషాన్ ఖట్టర్, మృణాల ఠాకూర్ జోడిగా రాజా కృష్ణమేనన్ పిప్పా ను తెరకెక్కించాడు. 1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తోబుట్టువులతో కలిసి ఇండియా కోసం పోరాడిన కెప్టెన్ బలరామ్ సింగ్ మోహతా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

Details

భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా 'ది రైల్వేమెస్'

ది రైల్వేమెస్ 1984లో చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనను కళ్లకు కట్టినట్టుగా 'ది రైల్వేమెస్' వెబ్ సిరీస్ లో చూపించారు. శివ రావైల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్, కేకే మేనన్, దివ్యేందు శర్మ, మందిరా బేడి నటించారు. స్కూప్ పాత్రికేయురాలు జాగృతి పాఠక్ జీవితాధారంగా హన్సల్ మెహతా దర్శకత్వంలో 'స్కూప్' సిరీస్‌ను తీశారు. ఈ మూవీ ప్రతిష్ఠాత్మక బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (బీఐఎఫ్‌ఎఫ్‌)లో ఉత్తమ ఆసియా టీవీ సిరీస్‌గా ఎంపికైంది. కాలాపాని అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు కలుషితమవడానికి కారణమేంటి అనే అంశంతో సమీర్ సక్సేనా, అమిత్ సంయుక్తంగా 'కాలాపాని' సిరీస్ ని రూపొందించారు. ఇది ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించింది.

Details

అయలీకి దర్శకత్వం వహించిన ముత్తు కుమార్

ది ఫ్రిలాన్సర్ ఈ సిరీస్‌ను భవ్ దులియా సరికొత్తగా తీశాడు. ఇందులో మోహిత్‌ రైనా, అనుపమ్‌ఖేర్‌, కష్మీరా పరదేశి, అయేషా రజా మిశ్రా, మంజరి ఫడ్నిస్‌, శత్‌ జేన్‌ డైసీ, సుశాంత్‌ సింగ్‌ తదితరులు నటించారు. సిరియా సరిహద్దులో ఉన్న ఐసిస్‌కు చిక్కుకున్న అలియా అనే మహిళను రక్షించేందుకు అవినాష్ దామోదరన్ ఎలాంటి సాహసం చేశాడనేది ఆసక్తిని రేపాయి. అయలీ ఊరి కట్టుబాట్లు దాటి ఓ అమ్మాయి ఎలా విద్యనభ్యసించింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? తదితర అంశాలతో రూపొందిందీ అయలీ సిరీస్‌ను తీశారు. అభి నక్షత్ర, అనుమోల్‌, మదన్‌, సింగంపులి, టీఎస్‌ ధర్మరాజు, లింగా నటించారు. ముత్తు కుమార్‌ దర్శకత్వం వహించారు.

Details

రికార్డులు సృష్టించిన 'రానా నాయుడు'

రానా నాయుడు 'రానా నాయుడు' విమర్శలు ఎదుర్కొన్నా రికార్డులను సృష్టించింది. 'నెట్‌ఫ్లిక్స్‌' విడుదల చేసిన ఈ వెబ్‌సిరీస్‌ 'ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌ల జాబితా (400)'లో 336వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌కు మాత్రమే ఆ లిస్ట్‌లో చోటు దక్కింది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటించిన ఈ తొలి వెబ్‌సిరీస్‌కు సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.