Pragya Nagra : అవి పూర్తిగా ఫేక్.. లీక్ వీడియోలపై స్పందించిన ప్రగ్యా
అక్టోబర్‌లో విడుదలైన లగ్గం సినిమాలో హర్యానా బ్యూటీ ప్రగ్యా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పెద్దగా పేరు రాకపోయినా, ఇటీవల ఒక లీక్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రగ్యా పేరు మీద కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై ప్రగ్యా తన ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగపూర్వకంగా స్పందించింది. ఈ వీడియోలు పూర్తిగా అబద్ధం. ఇది నిజంగా ఒక పీడ కలలా అనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాలకు సాయం చేయాలి, కానీ ఇలా మన గౌరవాన్ని దెబ్బతీయకూడదని పేర్కొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఇలాంటి చెడు ఆలోచనల నుంచి బయటపడటానికి నేను ప్రయత్నిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ రుణపడి ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది. ప్రగ్యా, ఈ వివాదంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీస్‌లను ట్యాగ్ చేస్తూ తన పోస్ట్‌లో తెలిపారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో దుర్వినియోగం చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రగ్యా పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఇలాంటి ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదని వారు అభిప్రాయపడ్డారు.