LOADING...
Vidya Balan: అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన 
అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన

Vidya Balan: అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్న తన వీడియోల గురించి బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ స్పష్టతనిచ్చారు. అవన్నీ అసలు తనవి కావని, ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన డీప్‌ ఫేక్‌ వీడియోలని ఆమె వెల్లడించారు. నెటిజన్లు మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సోషల్‌మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో తనతో సంబంధం ఉన్నట్లు చెబుతూ కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవన్నీ ఏఐ టెక్నాలజీతో రూపొందించిన డీప్‌ ఫేక్‌ వీడియోలు మాత్రమే. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటిని సృష్టించడం లేదా ప్రచారం చేయడంలో నా ప్రమేయం లేదు.

Details

ఫేక్ కంటెంట్ తప్పుదోవ పట్టిస్తోంది

ఏదైనా వీడియోను షేర్‌ చేయడానికి ముందు దాని నిజానిజాలను పరిశీలించండి. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఫేక్‌ కంటెంట్‌ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలంటూ విద్యాబాలన్‌ తెలిపారు. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వల్ల ఇప్పటికే అనేక సినీ తారలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్మిక మందన్నా, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌, అలియా భట్‌ వంటి ప్రముఖ నటీమణులు ఈ టెక్నాలజీ ప్రభావానికి గురయ్యారు. సినీ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. విద్యా బాలన్‌ చివరగా 'భూల్‌ భూలయ్యా 3'లో కీలక పాత్ర పోషించారు. కార్తిక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మల్లిక పాత్రలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.