
Kangana Ranaut: నన్ను అర్థం చేసుకోలేకపోయారు.. ఇంకెందుకు జడ్జ్ చేస్తున్నారు?.. కంగనా సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి చిత్ర పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'ఎమర్జెన్సీ' (Emergency) చిత్రాన్ని ఉద్దేశించి దర్శక-నిర్మాత సంజయ్ గుప్తా (Sanjay Gupta) చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.
సంజయ్ గుప్తా తన అంచనాలు తారుమారు అయ్యాయని పేర్కొనడంపై కంగనా మండిపడ్డారు.
ముందుగానే తన గురించి ఒక అభిప్రాయానికి రావొద్దని, తనని ఆర్థం చేసుకోలేకపోయారని చెప్పారు.
మళ్లీ తనపై అభిప్రాయం మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని, తన సినిమా ఎలా ఉందో ముందే ఆయన ఎలా తెలుసని ప్రశ్నించారు.
Details
ఓటిటి ప్రసారమవుతున్న 'ఎమర్జెన్సీ'
ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా? ఒక వ్యక్తిని జడ్జ్ చేసేముందు అన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలని ఆమె చెప్పారు.
అలా కాకుండా తక్షణ అభిప్రాయాలతో ముందుకు వెళ్లడం సమంజసం కాదు. మీరు స్వయంగా ఎలాంటి సినిమాలు తీశారో ఒక్కసారి వెనక్కి చూసుకోవాలటూ కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడంతో పాటు, నిర్మాతగానూ వ్యవహరించారు.
ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించగా, అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్‌గా, శ్రేయస్ తల్పడే అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో నటించారు.
ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతోంది.