Page Loader
Samantha: నాకొక కుటుంబాన్ని ఇచ్చారు.. తానా వేడుకల్లో స్టేజ్‌పై సమంత భావోద్వేగం
నాకొక కుటుంబాన్ని ఇచ్చారు.. తానా వేడుకల్లో స్టేజ్‌పై సమంత భావోద్వేగం

Samantha: నాకొక కుటుంబాన్ని ఇచ్చారు.. తానా వేడుకల్లో స్టేజ్‌పై సమంత భావోద్వేగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి సమంత అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యారు. 'తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 సంవత్సరాలు పట్టిందన్నది నాకే నమ్మలేకపోతున్నాను. ప్రతి ఏడాది తానా, ఇక్కడి తెలుగువారి గురించి వింటూనే వచ్చాను. నా తొలి సినిమా 'ఏమాయ చేసావే' నుంచే మీరు నన్ను మీ మనిషిలా చూసి ప్రేమించారని గుర్తుంచుకుంటున్నాను. ఈ ప్రేమకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇన్నాళ్లూ పట్టడం నా దౌర్భాగ్యం అంటూ ఆమె వేదికపై శిరస్సు వంచి నమస్కరించారు. సమంత మాట్లాడుతూ, ''ప్రస్తుతం కెరీర్ పరంగా కొత్త దశలో ఉన్నాను. 'ట్రాలాలా' అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించాను.

Details

మొదటి ప్రయత్నంలో 'శుభం' సినిమా చేశాను

మొదటి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా ఉత్తర అమెరికాలోని తెలుగువారి నుంచి ఎంతో ఆదరణ పొందింది. మంచి ఫలితాన్ని సాధించింది. నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో, చేసిన ప్రతి తప్పులో, మీరు నాకు అండగా ఉన్నారు. అందుకే ఎంతో గర్వంగా అనిపిస్తోందని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ పరిశ్రమలో పనిచేశానా, తన గురించి తెలుగు ప్రేక్షకులు గర్వపడతారా అనే ఆలోచన ఎప్పుడూ తనలో ఉంటుందని చెప్పిన సమంత ఈ ప్రయాణంలో మీరు నన్ను ఎత్తిపట్టారు, ఓ కుటుంబాన్ని ఇచ్చారు. 'ఓ బేబీ' సినిమాను మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేర్చడం కూడా మీ వల్లే సాధ్యమైంది.

Details

కంటతడి పెట్టిన సమంత

మీరు ప్రాంతంగా దూరంగా ఉండొచ్చు, కానీ మీరెప్పటికీ నా హృదయంలో ఉంటారని భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె కంటతడి పట్టలేకపోయారు. ఈ సందర్భంగా సమంత అభిమానుల నుంచి ఊహించని ఆదరణను అందుకోవడం, గత పదహారేళ్ల సినీ ప్రయాణాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనవడం హాల్‌లో ఉన్న వారిని కూడా ఆవేశపరిచింది.