Page Loader
Shweta Basu Prasad:'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి
'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి

Shweta Basu Prasad:'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

'కొత్తబంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందిన నటి శ్వేతాబసు ప్రసాద్‌ తాజాగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. టాలీవుడ్‌కు దూరమైన ఆమె, హిందీ టెలివిజన్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్వేతా, తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. ఒక తెలుగు సినిమా సెట్‌లో తాను అనుభవించిన అవమానాలు ఆమె హృదయాన్ని కలచివేశాయి. తన ఎత్తుపై చాలా కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు. సెట్‌లో ఉన్న ప్రతిఒక్కరూ తన ఎగతాళి చేసేవారని పేర్కొంది. హీరో ఆరడుగులు ఉన్నారని, , అయితే ఈ అమ్మాయి 5 అడుగులనేనని తనను కించపరిచేవారని చెప్పారు.

Details

హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో మంచిపేరు సంపాదించుకున్న శ్వేతా

ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందన్నారు. హీరో కూడా రీటేక్స్ ఎక్కువగా తీసుకుంటూ, తన పనిని మరింత కష్టతరం చేసేవారన్నారు. తానేమో ఏ విధంగానో డైలాగ్స్‌ను నేర్చుకొని సినిమా సెట్‌లో జీవితం సాగించేవాడిని, కానీ అతను మాత్రం తన ఎత్తు గురించి కామెంట్లు చేసేవారని తెలిపింది. 11 సంవత్సరాల వయసులో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా, 'మక్ది' అనే సినిమాతో తొలి దశలోనే గుర్తింపు తెచ్చుకుంది. 2008లో 'కొత్తబంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌కు ప్రవేశించి, 'రైడ్', 'కాస్కో', 'కళవర్‌ కింగ్' వంటి సినిమాల్లో కూడా నటించింది. 2018లో 'విజేత' సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో కన్పించలేదు, కానీ ప్రస్తుతం హిందీ టెలివిజన్‌ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు.