ThikaMaka Thanda : తికమక తాండ ట్రైలర్ రిలీజ్..విడుదల చేసిన విక్రమ్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ చిన్న సినిమా తికమక తాండ ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ మేరకు ప్రముఖ దర్శకుడు ధూత వెబ్ సిరీస్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ లాంఛ్ చేశారు.
ఇదే సమయంలో 'ఖలేజా', 'రాజన్న', 'రంగస్థలం' చిత్రాల్లో బాలనటిగా మెప్పించిన యానీ, కథానాయికగా పరిచయం అవుతున్న సినిమా 'తికమక తాండ'.
మరోవైపు నిర్మాతగా నా తొలి చిత్రమిది అని తిరుపతి శ్రీనివాసరావు అన్నారు.కుటుంబంతో కలిసి చూసేలా మాటల్లో,సన్నివేశాల్లో అసభ్యత లేకుండా తీశామన్నారు.
సిద్ శ్రీరామ్ పాడిన 'పుత్తడి బొమ్మ' పాటకు మంచి స్పందన లభించిందన్నారు.సురేశ్ బొబ్బిలి సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
మతి మరుపు వల్ల ఓ ఊరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది అన్న కథాంశం మీద తెరకెక్కించామని దర్శకుడు వెంకట్ తెలిపారు.
DETAILS
వాళ్ల దగ్గర శిష్యరికం చేసిన వెంకట్
సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఖలేజా', కింద నాగార్జున 'రాజన్న', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం', 'లూజర్' వెబ్ సిరీస్'లో యానీ బాలనటిగా మెప్పించింది.
ఇదే సమయంలో తికమక తాండ'లో ట్విన్స్ రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటించారు. ఇందులో రేఖా నిరోషా మరో కథానాయికగా ఆడిపానుంది.
TSR మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాస రావు నిర్మించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేరన్ పాండియన్, విక్రమ్ కె. కుమార్ వద్ద దర్శకత్వం విభాగంలో పని చేసిన వెంకట్ డైరెక్టర్'గా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.
DETAILS
తికమక తాండలో తారగణం
సినిమా పేరు : 'తికమక తాండ
రామకృష్ణ, హరికృష్ణ కథానాయకులు
యానీ, రేఖా నిరోషా కథానాయికలు
శివన్నారాయణ, 'బుల్లెట్' భాస్కర్, యాదమ్మ రాజు, 'రాకెట్' రాఘవ, 'బలగం' సుజాత, వెంకట్, బాబీ బేడీ, రామచంద్ర తదితరులు ప్రధాన తారాగణం.
కాస్ట్యూమ్ డిజైనర్ : హారిక పొట్ట,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోజడ్ల శ్రీవాస్,
లైన్ ప్రొడ్యూసర్: కోట కరుణ కుమార్,
పాటలు : పూర్ణా చారి & లక్ష్మణ్ గంగ,
కూర్పు : కుమార్ నిర్మల సృజన్,
కళా దర్శకత్వం : శ్రీనివాస్,
కథ : బి.ఎన్. నిరూప్ కుమార్,
ఛాయాగ్రహణం : హరి కృష్ణన్,
సంగీతం : సురేష్ బొబ్బిలి,
స్కీన్ ప్లే : వెంకట్- BN నిరూప్ కుమార్- కుమార్ నిర్మల సృజన్,
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు,
మాటలు - దర్శకత్వం : వెంకట్.