Page Loader
Devara: 'దేవర' విడుదలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!
'దేవర' విడుదలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!

Devara: 'దేవర' విడుదలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో దేవర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో ఆరేళ్ల విరామం తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'దేవర'లో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో చిత్రమిది. ఈ చిత్రంలో వరద, దేవర అనే రెండు పాత్రలు పోషిస్తున్నాడు.

Details

విడుదలకు ముందే 'దేవర' రికార్డులు

'దేవర'ను 1980-90ల నేపథ్యంలో నిర్మించారు, ఇది కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ పాత్ర 'ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు కొరటాల శివ రాసుకున్న కథ మొత్తం దాదాపు 9 గంటల రన్‌టైమ్ కలిగి ఉందని, అందువల్ల 'దేవర'ను రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్‌గా ఉండి, ఇది చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక కొన్ని సన్నివేశాలు నైట్ ఎఫెక్ట్‌లో ఉండనున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులు సృష్టించింది. ఇందులోని 'చుట్టమల్లే' పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సాధించింది.