Loading...
Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే.. అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్!
బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే.. అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్!

Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే.. అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'రాకా' (Raaka). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటించబోయే నటీనటుల ఎంపికకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి 'రాకా'లో పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ రూమర్లపై ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

వివరాలు

'అసలు ఆ సినిమాలో నేనే లేను'

'రాకా'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐశ్వర్య లక్ష్మి బహిరంగంగానే స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు.

సోషల్ మీడియాలో ఈ పుకార్లు చూసి తొలుత ఆశ్చర్యపోయి, ఆ తర్వాత నవ్వుకున్నానని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.

అసలు ఆ సినిమాలో నేనే లేను, ఎవరైనా నాకు ఈ ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పిస్తే బాగుంటుందంటూ సరదాగా కామెంట్ చేశారు.

దీంతో గత కొన్ని రోజులుగా 'రాకా'లో ఐశ్వర్య లక్ష్మి విలన్ పాత్రలో నటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె ఒక్క ప్రకటనతో తెరపడినట్లయింది.

వివరాలు

'రాకా'లో నలుగురు హీరోయిన్లు?

ఇక దర్శకుడు అట్లీ ఈ సినిమాను భారీ కాన్వాస్‌పై ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగా 'రాకా'లో మొత్తం నలుగురు హీరోయిన్లకు చోటు ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో బలమైన టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. అల్లు అర్జున్ సరసన మెయిన్ ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటించనున్నారని సమాచారం.

అలాగే మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫెమినా జార్జ్ కూడా మరో కీలక పాత్ర కోసం ఇప్పటికే ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

మిగిలిన రెండు పాత్రల కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

'రాకా'పై పెరుగుతున్న హైప్

అయితే ఈ ఇద్దరి విషయంలోనూ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక గ్రీన్ సిగ్నల్ రాలేదు.

'పుష్ప' ఫ్రాంచైజీతో గ్లోబల్ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. 'జవాన్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీతో చేతులు కలపడంతో 'రాకా'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్‌కు సంబంధించి జరుగుతున్న మార్పులు, చేర్పులు సినిమాపై ఆసక్తిని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్నాయి.

అసలు 'రాకా'లో ఎంత మంది హీరోయిన్లు నటిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT