Vijay Deverakonda: విజయ్ దేవరకొండ '14'కి ఫిక్స్ అయిన పవర్‌ఫుల్ టైటిల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండిపెండెన్స్‌కు ముందు రాయలసీమ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని, వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి అంశాలను కథలో ప్రధానంగా మలుస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ 'రణబలి' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
Details
రిపబ్లిక్ డే రోజున అధికారిక ప్రకటన
రిపబ్లిక్ డే కానుకగా సోమవారం ఈ టైటిల్‌ను అధికారికంగా విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు టైటిల్‌తో పాటు విజయ్ దేవరకొండ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ - రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది. ఈసారి మరింత బలమైన కథ, పక్కా కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Details
మైత్రీ మూవీస్ నిర్మాణంలో మూవీ
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వంటి వరుస ప్లాప్స్‌తో నిరుత్సాహంలో ఉన్న విజయ్ దేవరకొండ అభిమానులు 'రణబలి' తో తమ హీరో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ధీమాగా ఉన్నారు. మొత్తం మీద ఈ సినిమా విజయ్ కెరీర్‌లో కీలక మైలురాయిగా మారుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.