LOADING...
LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్
ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్‌కు 'కూలీ' సినిమా అనూహ్యంగా భారీ నెగటివిటీని తెచ్చిపెట్టింది. క్రిటిక్స్ మాత్రమే కాదు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు కూడా లోకేశ్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత తమిళ ఇండస్ట్రీలోని కొందరు హీరోలు లోకేశ్‌తో పని చేయడంపై ఒక అడుగు వెనక్కి వేసినట్లు టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న లోకేశ్, టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

Details

భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు

అయితే బన్నీతో సినిమా మొదలుపెట్టే ముందు కార్తీ హీరోగా 'ఖైదీ 2' తెరకెక్కించాల్సి ఉండగా, 'కూలీ' ప్రభావంతో ఆ సినిమాను పక్కనబెట్టినట్లు సమాచారం. 'ఖైదీ' సినిమాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లోకేశ్ నుంచి ఆ కథకు సీక్వెల్ ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఖైదీ 2' ఆలస్యం అవుతుందన్న పుకార్లపై కూడా లోకేశ్ స్వయంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, 'ఖైదీ 2ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. నా ఇతర కమిట్‌మెంట్ల వల్లే ఈ గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్ - కమల్ హాసన్ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేయమని నన్ను అడగడంతో, దాదాపు ఒకటిన్నర నెలల పాటు స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో పని చేశాను.

Details

సింపుల్ కథను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు

అయితే వారు వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో, ఈసారి ఒక సింపుల్ కథ కావాలని భావించారు. కానీ నాకు సింపుల్ కథను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అందుకే ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ఆ కారణంగానే 'ఖైదీ 2'ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా పూర్తి చేసిన వెంటనే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను. అలాగే విక్రమ్ 2తో పాటు రోలెక్స్ సినిమా కూడా ఉంటాయని స్పష్టత ఇచ్చారు. ఈ ప్రకటనతో 'ఖైదీ 2'పై ఉన్న సందేహాలకు కొంతవరకు తెరపడినట్టే అయింది.

Advertisement