Page Loader
RT76 : రవితేజ - కిశోర్ తిరుమల టైటిల్ ఇదే..
రవితేజ - కిశోర్ తిరుమల టైటిల్ ఇదే..

RT76 : రవితేజ - కిశోర్ తిరుమల టైటిల్ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఒకవైపు దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న 'మాస్ జాతర' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న రవితేజ, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. అదే సమయంలో తన తదుపరి చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. 'నేను శైలజా', 'చిత్రలహరి' వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల సారథ్యంలో రవితేజ కొత్త సినిమా ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమాకు పూజా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యిందని సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

ఈ సినిమా పేరు 'అనార్కలి' 

అంతేకాకుండా,ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.కిషోర్ తిరుమల మునుపటి చిత్రాలకు అనుగుణంగా,ఈ సినిమాకు 'అనార్కలి' అనే మృదువైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, దాదాపుగా అదే ఫైనల్‌గా నిర్ణయించబడ్డట్టు టాక్. రవితేజ తనదైన శైలి కామెడీతో పాటు,కిషోర్ తిరుమల శైలిలో ఉండే భావోద్వేగాల మిశ్రమంగా ఈ కథ సాగనుండగా, 'అనార్కలి' అనే టైటిల్ చాలా బాగా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవల కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆషిక రంగనాథ్,ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.