Loading...
Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ..
ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ..

Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ ఇండస్ట్రీలో వరుసగా వస్తున్న సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కుంచాకో బోబన్, 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉన్మాదం' ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు.

వివరాలు

ఆరు నెలల క్రితం మూసివేసిన ఓ అన్‌సాల్వ్డ్ కేసు..

ఇక కథ విషయానికి వస్తే.. కొంగడ్ పోలీస్ స్టేషన్‌లో ఆరు నెలల క్రితం మూసివేసిన ఓ అన్‌సాల్వ్డ్ కేసు ఫైల్ చుట్టూనే కథ సాగుతుంది.

ఆ కేసు ఫైల్‌ను తిరిగి తెరిచేందుకు సీనియర్ పోలీసు అధికారులు సైతం భయపడుతుంటారు.

అయితే ఆ కేసును ఛేదించేందుకు ఓ పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా ముందడుగు వేస్తాడు.

ఈ పాత్రలో కుంచాకో బోబన్ కనిపించారు. కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అతడికి భయానక మూఢనమ్మకాలు, ఊహించని సూపర్‌నేచురల్ ఘటనలు ఎదురవుతాయి.

ఓవైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. మరోవైపు సైకలాజికల్ హర్రర్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

వివరాలు

సెప్టెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో..

జాతీయ అవార్డు గ్రహీత షాహి కబీర్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు 'ఉన్మాదం' మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఈ సినిమా జులై 31, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సాధారణ ఇన్వెస్టిగేటివ్ డ్రామాకు భిన్నంగా సైకలాజికల్ హర్రర్ మిస్టరీగా రూపొందిన 'ఉన్మాదం'.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఆసక్తికరమైన వీక్షణ అనుభూతిని అందించనుంది.

సెప్టెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు వీక్షించవచ్చు.

ADVERTISEMENT