LOADING...
Coolie : కూలీ సినిమాలో ఆమిర్‌కి దక్కిన రోల్‌ మొదట ఈ స్టార్ హీరోదే! 
కూలీ సినిమాలో ఆమిర్‌కి దక్కిన రోల్‌ మొదట ఈ స్టార్ హీరోదే!

Coolie : కూలీ సినిమాలో ఆమిర్‌కి దక్కిన రోల్‌ మొదట ఈ స్టార్ హీరోదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. కారణం ఏమిటంటే... రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో ఆయన పోషించిన 'దహా' అనే క్యారెక్టర్‌. ఈ రోల్ గురించి సినీ వర్గాలన్నీ చర్చిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ చేసింది బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ను. ఆయనకు స్క్రిప్ట్ కూడా వినిపించారట. అయితే కొన్ని కారణాల వల్ల షారూక్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ నేరుగా ఆమిర్‌ ఖాన్‌ను సంప్రదించాడు. రజినీతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఇది.

Details

ఒక్క రూపాయి కూడా రెమ్యూనేషన్ తీసుకొని అమీర్ ఖాన్

రోల్ చిన్నదే అయినా ఇంపాక్ట్ చాలా పెద్దది అని భావించిన ఆమిర్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముఖ్యంగా రజినీకాంత్‌పై ఆయనకున్న గౌరవం, లోకేష్‌పై నమ్మకంతో ఈ రోల్ కోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ ఈవెంట్స్‌లో కూడా చాలా అరుదుగా కనిపించే ఆమిర్‌ ఖాన్‌ ఈసారి సౌత్‌లోనూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. రజినీ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై అభిమానులను థ్రిల్ చేశాడు. అక్కడ 5 నిమిషాల స్పీచ్‌తో అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆమిర్‌ మాటల్లో ఉన్న సింప్లిసిటీ, రజినీపై ఆయనకున్న గౌరవం స్పష్టంగా బయటపడింది.

Details

నన

నేను సాధారణంగా ఈవెంట్స్‌కు రాను. కానీ రజినీ సర్ పిలిచినప్పుడు తిరస్కరించలేకపోయాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్‌గా రజినీ సర్‌తో ఒకే ఫ్రేమ్‌లో ఉన్నానని ఆయన అన్నారు. ఆమిర్‌ స్పీచ్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ సౌత్ అభిమానుల మనసులు గెలిచాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై ఆమిర్‌ ఖాన్‌ నటించే తదుపరి సినిమాలకు సౌత్‌లోనూ గ్రాండ్ వెల్కమ్ ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.