LOADING...
BIGG BOSS Season 9: ఈసారి చదరంగం కాదు.. రణరంగం.. బిగ్‌బాస్‌-9లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్‌! 

BIGG BOSS Season 9: ఈసారి చదరంగం కాదు.. రణరంగం.. బిగ్‌బాస్‌-9లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్‌! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌ తెలుగు' మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌కు పునఃప్రారంభం కానుంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. 'చదరంగం కాదు.. ఈసారి రణరంగం' అంటూ సీజన్ 9ను ప్రకటించింది. తాజాగా ఆయన మరో కీలక అప్‌డేట్‌ పంచుకున్నారు. ఈసారి 'బిగ్‌బాస్‌ 9' హౌస్‌ తలుపులు సెలబ్రిటీలకే కాదు, సామాన్యులకూ తెరిచివేస్తోంది. 'ఇప్పటివరకూ బిగ్‌బాస్‌ను మీరు ఎంతగానో ప్రేమించారు. ఆ ప్రేమకు రిటర్న్ గిఫ్ట్‌గా, ఈసారి మీకూ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశమని నాగార్జున తెలిపారు.

Details

టీజర్ రిలీజ్

ఇందులో పాల్గొనాలనుకునేవారు [bb9.jiostar.com](http://bb9.jiostar.com) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి, బిగ్‌బాస్‌లో పాల్గొనాలన్న తమ ఉద్దేశాన్ని వీడియో రూపంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. షరతులు పరిపూర్ణంగా ఉండి ఎంపికైతే, హౌస్‌మేట్‌ అయ్యే అవకాశం లభిస్తుంది. 'ఆటలో అలసటతో గెలుపు రాదు.. యుద్ధం చేస్తే సరిపోదు.. ప్రభంజనం సృష్టించాలంటూ బిగ్‌బాస్‌ 9 కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీజర్‌లో నాగార్జున తెలిపారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో నాగార్జున స్థానంలో బాలకృష్ణ ఈ సారి వ్యాఖ్యాతగా రావొచ్చని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చినా.. చివరకు నాగార్జునే ఈ సీజన్‌కు స్వయంగా ప్రకటించడం ద్వారా వాటికి స్వస్తి చెప్పారు.

Details

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆహ్వానం

ప్రస్తుతం హౌస్‌మేట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే పలు సినీ, టీవీ నటులతో పాటు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. ఒప్పందాలు పూర్తయ్యాక అధికారికంగా వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. గత సీజన్లలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే అవకాశమివ్వగా.. ఈసారి బిగ్‌గా ప్రకటన ఇచ్చి సామాన్యులకు హౌస్‌లో ప్రవేశించే ఛాన్స్ కల్పించడంతో ఈ సీజన్‌పై అంచనాలు మోతాదుగా పెరిగాయి.