
Upcoming Movies Telugu: ఈ వారం థియేటర్‌లలో పండుగ.. ఓటీటీలో కూడా వినోద హంగామా!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మే 9వ తేదీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా నిలవనుంది. వివిధ భావోద్వేగాలపై ఆధారపడిన పలు సినిమాలు అదే రోజున థియేటర్లలోకి రాబోతున్నాయి.
కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు, హారర్ నుంచి ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ వరకు మొత్తం ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
1. నవ్వుల పంట పండించనున్న 'సింగిల్'
శ్రీ విష్ణు, కథానాయికలుగా కేతిక శర్మ, ఇవానా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' మే 9న విడుదల కానుంది. దర్శకుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్నిరూపొందించారు.
అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. సినిమా కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుందని శ్రీ విష్ణు తెలిపారు.
Details
2. 'శుభం': నవ్వులతో పాటు హారర్ థ్రిల్ కూడా!
నటి సమంత తన స్వంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా 'శుభం' కూడా అదే రోజు విడుదల కానుంది.
'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొంతం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
3. భవిష్యత్తును చూపించే 'కలియుగమ్ - 2064'
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కలియుగమ్ - 2064' మే 9న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భవిష్యత్తులో అంటే 2064లో మనుషులు ఎలా జీవిస్తారనే విషయాన్ని ఫ్యూచరిస్టిక్ దృక్పథంతో చూపించబోతోంది.
Details
4. క్రైమ్ థ్రిల్లర్‌తో 'బ్లైండ్ స్పాట్'
నవీన్ చంద్ర, రాశి సింగ్ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్ స్పాట్' కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు రాకేశ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
ద్విపాత్రాభినయమా? అనే ఉత్కంఠను సృష్టిస్తూ సినిమా మీద ఆసక్తి పెంచారు.
5. మళ్లీ థియేటర్లలోకి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'
చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసిక్ ఫాంటసీ మూవీ'జగదేక వీరుడు అతిలోక సుందరి' మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మే 9న తిరిగి విడుదల చేస్తున్నారు. ఈసారి 2Dతో పాటు 3D వెర్షన్‌లోనూ ప్రేక్షకులను అలరించనుంది.
Details
ఓటిటిలో విడుదలయ్యే చిత్రాలివే
నెట్ ఫ్లిక్స్
ది మ్యాచ్ (మే 7)
లాస్ట్ బుల్లెట్ (మే 7)
గుడ్ బ్యాడ్ అగ్లీ (మే 8)
ది హాంటెండ్ అపార్ట్ మెంట్ మిస్సిక్ (మే 8)
బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ (మే 8)
ఈటీవీ విన్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (మే 08)
అమెజాన్ ప్రైమ్ వీడియో
గ్రామ్ చికత్సాలయమ్ (మే 09)