LOADING...
This Week Ott Releases: ఈ వారం ఓటీటీ వేదికలపై వినోదం హంగామా.. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఈ వారం ఓటీటీ వేదికలపై వినోదం హంగామా.. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు ఇవే!

This Week Ott Releases: ఈ వారం ఓటీటీ వేదికలపై వినోదం హంగామా.. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాంత' నవంబర్‌ 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో 'కాంత' చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీబోర్సే హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు. SuperMan 2025 OTT డీసీ యూనివర్స్‌లో వచ్చే 'సూపర్‌మ్యాన్' చిత్రాలకు దేశవ్యాప్తంగా అపార క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన 'సూపర్‌మ్యాన్' చిత్రం కూడా యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈచిత్రం జియో హాట్‌స్టార్ వేదికగా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Details

కలివి వనం

తెలంగాణ జానపద సోయగాలను ప్రతిబింబించిన 'కలివి వనం' (Kalivi Vanam) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలుకరించడానికి సిద్ధమైంది. నాగదుర్గ నటించిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకృతి అందాలను తెలంగాణ నేపథ్యంలో చక్కగా చూపిస్తూ, రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సింగిల్ పాపా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో నూతన వెబ్‌సిరీస్ సిద్ధమైంది. కునాల్ ఖేము, నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో శశాంక్ ఖైతాన్,నీరజ్ ఉధ్వాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ 'సింగిల్ పాపా'. బిడ్డను దత్తత తీసుకున్న ఒక వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను కథగా మలిచిన సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.

Details

3 రోజేస్

ఈషా రెబ్బా, రాశీ సింగ్, ఖుషిత హర్ష, సత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ '3 రోజెస్' రెండో సీజన్ డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సీజన్ డిసెంబర్ 13 నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. యువతను ఆకట్టుకునే అంశాలను మేళవిస్తూ కథను మలిచినట్లు విడుదలైన ప్రచార కంటెంట్ సూచిస్తోంది.

Advertisement

Details

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్‌ మ్యాన్‌ వర్సెస్‌ బేబీ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ జియో హాట్‌స్టార్‌ ది గ్రేట్‌ షంషుద్దీన్‌ ఫ్యామిలీ (మూవీ) హిందీ ఆరోమాలే (మూవీ) తమిళ్‌/తెలుగు అమెజాన్‌ ప్రైమ్‌ మెర్వ్‌ (మూవీ) ఇంగ్లీష్‌ 40 ఏకర్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌ టెల్‌ మి సాఫ్ట్లీ (మూవీ) ఇంగ్లీష్‌ జీ5 సాలీ మొహబ్బత్‌ (మూవీ) హిందీ కేసరియా (డాక్యుమెంటరీ) హిందీ)

Advertisement