
Telugu Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి.
ఈసారి దసరా సందర్భంగా పెద్ద సినిమాలు థియోటర్ వద్ద సందడి చేశాయి.
చిన్న సినిమాల కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలను ఆదరిస్తారు.
అయితే ఈ వారం బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమాలతో పాటు ఓటీటీలోనూ అలరించే సినిమాలేమిటో తెలుసుకుందాం.
సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్', ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధవిమాన పైలట్ తేజస్ గిల్. కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే 'తేజస్'. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 27న థియేటర్లలోకి వస్తోంది.
Details
అక్టోబర్ 27న ఘోస్ట్ రిలీజ్
కన్నడ స్టార్ శివ రాజమ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఘోస్ట్'. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 27న తెలుగులో విడుదల కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ (డాక్యుమెంటరీ సిరీస్) అక్టోబరు 25
చంద్రముఖి 2 (తమిళ్/తెలుగు) అక్టోబరు 26
పెయిన్ హజ్లర్స్ (హాలీవుడ్) అక్టోబరు 27
అమెజాన్ ప్రైమ్
ఆస్పిరెంట్స్ (హిందీ సిరీస్2) అక్టోబరు 25
ట్రాన్స్‌ఫార్మార్స్ (హాలీవుడ్) అక్టోబరు 26
కాన్‌సిక్రేషన్ (హాలీవుడ్) అక్టోబరు 27
కాస్టావే దివా (కొరియన్) అక్టోబరు 28
ఆహా
పరంపోరుళ్ (తమిళ) అక్టోబరు 24
డిస్నీ+హాట్‌స్టార్
స్కంద (తెలుగు) అక్టోబరు 27