OTT Movies: ఈ వారాంతంలో ఓటీటీల్లో సందడి.. ప్రేక్షకులను అలరించే తాజా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈవారం ఓటీటీల్లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా కీలక పాత్రలు పోషించిన తెలుగు చిత్రం 'గోదారి గట్టుపైన' తాజాగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. ఇంజినీరింగ్ చదువుతున్న తన కుమార్తె ఓ ఆటో డ్రైవర్‌ను ప్రేమిస్తోందని తెలుసుకున్న తండ్రి ఎలా స్పందించాడు? ఆమె ప్రేమను అంగీకరించాడా? లేక తన అభిప్రాయానికి అనుగుణంగా మరొకరితో వివాహం జరిపించాలని ప్రయత్నించాడా? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.
వివరాలు
ధనుష్ లేటెస్ట్ హిట్ కర..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటించిన 'జెట్లీ' చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. కథానాయికగా రియా సింఘా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ధనుష్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కర' కూడా ఓటీటీలోకి అడుగుపెట్టింది. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఎస్. రవికుమార్, పృథ్వీరాజన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
కుటుంబ కథా చత్రం...
నిఖిలా శంకర్, రాజ్ అయ్యప్ప, బోస్ వెంకట్, గాయత్రి శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్'కు చిదంబరం మణివన్నన్ దర్శకత్వం వహించారు. తమ తండ్రే తమ ప్రపంచమని భావించే పిల్లలు, ఆయనకు మరో కుటుంబం కూడా ఉందని తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఆ నిజం బయటపడిన తర్వాత ఆ రెండు కుటుంబాలకు చెందిన సోదర సోదరీమణులు కలిసి ఏమి చేశారు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది. ప్రచార చిత్రాల ఆధారంగా చూస్తే ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్లో ప్రసారమవుతోంది.