LOADING...
This Week Movie Releases: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపే సినిమాలివే.. థియేటర్‌-ఓటీటీలో ఎంటర్టైన్‌మెంట్‌ పక్కా గ్యారంటీ 
ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపే సినిమాలివే.. థియేటర్‌-ఓటీటీలో ఎంటర్టైన్‌మెంట్‌ పక్కా గ్యారంటీ

This Week Movie Releases: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపే సినిమాలివే.. థియేటర్‌-ఓటీటీలో ఎంటర్టైన్‌మెంట్‌ పక్కా గ్యారంటీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

'బహుబలి' మరోసారి ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి రెండు భాగాలుగా కాదు — ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజమౌళి రూపొందించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్‌' (Baahubali: The Epic) పేరుతో అక్టోబర్‌ 31న థియేటర్లలో విడుదల కానుంది. రెండు భాగాల కథను ఒకే చిత్రంగా మలచిన ఈ ఎడిటెడ్‌ వెర్షన్‌ నిడివి సుమారు 3 గంటల 44 నిమిషాలు ఉండనుంది. ఈ ఎడిటింగ్‌ ప్రక్రియను దర్శకుడు రాజమౌళి స్వయంగా పర్యవేక్షించినట్టు సమాచారం. ఏ సన్నివేశాలను ఉంచారు, ఏవాటిని తొలగించారు అనే విషయంలో ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 'బాహుబలి: ది ఎపిక్‌' కోసం టికెట్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Details

 ఒక రోజు వాయిదా వేసిన 'మాస్‌ జాతర'

రవితేజ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మాస్‌ జాతర' (Mass Jathara) సినిమా అక్టోబర్‌ 31న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజు 'బాహుబలి: ది ఎపిక్‌' థియేటర్లలోకి వస్తుండటంతో, చిత్రబృందం విడుదలను ఒక రోజు వాయిదా వేసినట్టు సమాచారం. నవంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్‌ 31న ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సంగీతం భీమ్స్‌ సిసిరోలియో అందించారు.

Details

క్రైమ్‌ థ్రిల్లర్‌గా 'కర్మణ్యే వాధికారస్తే'

శత్రు, బ్రహ్మాజీ, మహేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'కర్మణ్యే వాధికారస్తే' (Karmanye Vadhikaraste) కూడా అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఉషస్విని ఫిలిమ్స్‌ బ్యానర్‌పై డీఎస్‌ఎస్‌ దుర్గా ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి అమర్‌ దీప్‌ చల్లపల్లి దర్శకత్వం వహించారు. ఆధునిక నేర ప్రపంచంలోని సంఘటనల ఆధారంగా సాగే కథతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది. వివాదాస్పద పోస్టర్‌తో 'ది తాజ్‌ స్టోరీ' పరేశ్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ది తాజ్‌ స్టోరీ'(The Taj Story)కూడా అక్టోబర్‌ 31న థియేటర్లలోకి రాబోతోంది. తుషార్‌ అమ్రిష్‌ గోయెల్‌ దర్శకత్వంలో సురేశ్‌ ఝూ నిర్మించిన ఈ చిత్రానికి ఇటీవల విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ కొంత వివాదాస్పదమైంది.

Details

 ఓటీటీ రిలీజ్‌లు

నెట్‌ఫ్లిక్స్ ది అస్సెట్ (మూవీ) - అక్టోబర్‌ 27 అలీన్ (మూవీ) - అక్టోబర్‌ 30 ఇడ్లీ కొట్టు (మూవీ) - అక్టోబర్‌ 29 బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (మూవీ) - అక్టోబర్‌ 29 అమెజాన్‌ ప్రైమ్‌ హెడ్డా (మూవీ) - అక్టోబర్‌ 29 హెజ్బిన్‌ హోటల్‌* (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 29 జియో హాట్‌స్టార్‌ మానా కీ హమ్ యార్‌ నహీన్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 29 లోక చాప్టర్‌: 1 - అక్టోబర్‌ 31 సన్‌ నెక్ట్స్‌ బ్లాక్‌ మెయిల్‌ (మూవీ) - అక్టోబర్‌ 30 జీ5 మారిగల్లు (మూవీ) - అక్టోబర్‌ 31