ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేసే చిత్రాల లిస్టులో మొదటి ప్లేస్ లో శాకుంతలం నిలుస్తుంది. సమంత నటించిన శాకుంతలం చిత్రం, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.
సమంత కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను వెండితెర మీద కళ్ళకు కట్టినట్టుగా త్రీడీలో చూపించడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు గుణశేఖర్.
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ల పై రూపొందిన ఈ సినిమాకు నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమా
తెలుగు తెరమీద కనిపించబోతున్న లారెన్స్
తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం, ఏప్రిల్ 15వ తేదీన తెలుగులో రిలీజ్ అవుతుంది. తమిళంలో విడుతలై పేరుతో రిలీజైంది ఈ చిత్రం.
సూరి, భవాని శ్రీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటించారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
రుద్రుడు:
రాఘవ లారెన్స్ మరోమారు తన మార్క్ కథను ప్రేక్షకులకు చెప్పడానికి సిద్ధమైపోతున్నాడు. యాక్షన్ డ్రామా రూపొందిన రుద్రుడు సినిమాను కతిరేశన్ తెరకెక్కించారు.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో, శరత్ కుమార్ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 14న థియేటర్లలోకి వస్తుంది.