
Year Ender 2024: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..!
ఈ వార్తాకథనం ఏంటి
023 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో పలు విషాద క్షణాలను తీసుకొచ్చింది.
ఈ ఏడాది సంగీత దిగ్గజం జాకీర్ హుస్సేన్, ప్రజా గాయకుడు గద్దర్, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ సహా మరెన్నో ప్రముఖులు కన్నుమూశారు.
ఈ ఏడాది మన మధ్య నుంచి ఎవరెవరు దూరమయ్యారో వివరంగా తెలుసుకుందాం.
శ్యామ్ బెనెగల్
దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఈ ఏడాది డిసెంబరు 23న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల ఆయన మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ వోడ్‌హార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఆయన్ను 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించారు.
Details
రామోజీ రావు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు జూన్ 8న తుదిశ్వాస విడిచారు.
మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రామోజీ రావు తన జీవితకాలంలో సితార సినీ పత్రిక, ఈటీవీ ఛానెల్స్, ఫిల్మ్ సిటీ వంటి వినూత్న ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్నారు.
జాకీర్ హుస్సేన్
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ డిసెంబరు 15న అమెరికాలో కన్నుమూశారు. భారత శాస్త్రీయ సంగీతంలో అగ్రగామిగా పేరు గడించిన ఆయన ఐదు గ్రామీ అవార్డులు పొందారు.
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో ఆయన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది.
Details
గద్దర్
తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ప్రాణం పోశించిన ప్రజా గాయకుడు గద్దర్ ఆగస్టు 6న కన్నుమూశారు. ఆయన రచనలు, పాటలు ప్రజల్లో చైతన్యం నింపాయి.
'అమ్మా తెలంగాణమా' వంటి పాటలు గద్దర్ గొంతుకు గుర్తుగా నిలిచాయి.
బలగం మొగిలయ్య
తెలుగు జానపద గాయకుడు పస్తం మొగిలయ్య డిసెంబరు 19న కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. బలగం చిత్రంలో ఆయన పాడిన పాటలు ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచాయి.
ఉస్తాద్ రషీద్ ఖాన్
ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ జనవరి 9న ప్రోస్టేట్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన ఆయన 2006లో పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు.
Details
రితురాజ్ సింగ్
ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20న గుండెపోటుతో మరణించారు.
పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల ద్వారా గుర్తింపు పొందిన రితురాజ్, షారుఖ్ ఖాన్‌తో కలిసి చదువుకున్న అనుబంధాన్ని చాలా సందర్భాల్లో పంచుకున్నారు.
పంకజ్ ఉదాస్
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26న కన్నుమూశారు. హిందీ గజల్ సంగీతంలో ఆయన తనదైన ముద్ర వేశారు. 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.
సుహానీ భట్నాగర్
'దంగల్' చిత్రంలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్ డెర్మాటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో ఫిబ్రవరి 19న మరణించారు.
Details
శారదా సిన్హా
జానపద గాయని శారదా సిన్హా నవంబరు 5న మైలోమా క్యాన్సర్‌తో కన్నుమూశారు.
ఆమె పాటలు ప్రజాదరణ పొందడంతో పాటు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాయి.
సూర్యకిరణ్
తెలుగు దర్శకుడు సూర్యకిరణ్ మార్చి 11న జాండిస్‌తో మరణించారు. 'సత్యం' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన దశ తిరగకపోవడంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు.
డేనియల్ బాలాజీ
తమిళ నటుడు డేనియల్ బాలాజీ మార్చి 30న గుండెపోటుతో మరణించారు. విలన్ పాత్రల ద్వారా సౌతిండియన్ చిత్రసీమలో గుర్తింపు పొందిన ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.
పవిత్రా జయరామ్
కన్నడ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో నటుడు కూడా గాయాలపాలయ్యారు.