Year Ender 2024: బ్లాక్ బస్టర్ వర్సెస్ అట్టర్ ఫ్లాప్.. ఈ ఏడాది టాలీవుడ్ లో సత్తా చాటిన సినిమాలివే!
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో సరికొత్త సినిమాలు విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కల్కి, 'పుష్ప 2, దేవర, హన్‌మాన్, గుంటూరు కారం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అలాగే 2025లో 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'హరిహర వీరమల్లు', 'ఓజీ' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది తెలుగులో అద్భుత విజయాలు సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం.
1. హన్-మాన్
సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన చిత్రం 'హన్-మాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం అంచనాలను దాటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2. ఊరుపేరు భైరవకోన ఫిబ్రవరిలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'ఊరుపేరు భైరవకోన' సక్సెస్ అయింది. రూ.50 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 3. టిల్లు స్క్వేర్ మార్చిలో, 'డీజే టిల్లు' సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. సిద్దూ జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
4. కల్కి 2898 ఏడీ
'కల్కి' చిత్రం టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన చిత్రం గా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రం గా నిలిచింది. 5. దేవర సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీ విజయం సాధించింది. ఈచిత్రం రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టి, టాలీవుడ్‌లో రికార్డు సృష్టించింది. పుష్ప 2: దిరూల్ టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'పుష్ప 2: ది రూల్'. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. 'బాహుబలి' తర్వాత రూ.1400 కోట్ల వసూళ్లు చేసి టాలీవుడ్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది.