Tollywood : సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్స్.. రవితేజ-శర్వా-మీనాక్షికి సెంటిమెంట్ మళ్లీ కలిసి వస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ కమర్షియల్ హీరోగా స్థిరపడిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ అందుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. కాలక్రమేణా అది ఓ బలమైన సెంటిమెంట్‌గా మారింది. ఈ విజయ పరంపర చిరంజీవి అన్నయ్య సినిమా నుంచే ప్రారంభమైంది. 2003 సంవత్సరం మినహా, మిగిలిన ప్రతి పొంగల్ సీజన్‌లోనూ రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ లేదా హిట్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2008 పొంగల్ బరిలోకి దిగిన 'కృష్ణ' చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న విడుదలై దాదాపు రూ.25 కోట్ల వసూళ్లను సాధించింది.
Details
గతంలో సూపర్ హిట్ గా నిలిచిన క్రాక్
ఆ తర్వాత 2010లో రవితేజ, నరేష్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన 'శంభో శివ శంభో' కూడా సంక్రాంతి హిట్‌గా నిలిచింది. 2011లో విడుదలైన 'మిరపకాయ్' రవితేజ కెరీర్‌లో కీలక మలుపు తీసుకొచ్చిన సినిమా. ఈ చిత్రంతోనే ఆయనకు 'మాస్ మహారాజ్' ట్యాగ్ శాశ్వతంగా స్థిరపడింది. అనంతరం 2021 సంక్రాంతి బరిలోకి వచ్చిన 'క్రాక్' సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే 2023లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పొంగల్‌కు వచ్చిన 'వాల్తేరు వీరయ్య' కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Details
రవితేజకు ఈ సంక్రాంతి అత్యంత కీలకం
ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లతో కలిసి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 'ధమాకా' తర్వాత సరైన హిట్స్ లేని రవితేజకు ఈ సంక్రాంతి విజయం అత్యంత కీలకంగా మారింది. ఇక సంక్రాంతి బరిలో తీవ్ర పోటీ ఉందని తెలిసినా, రిస్క్ తీసుకుని పోటీలోకి దిగుతున్న మరో హీరో శర్వానంద్. ఆయనకూ పొంగల్ సీజన్ ఓ ప్రత్యేక సెంటిమెంట్‌గా మారింది. 2016 సంక్రాంతికి వచ్చిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' హిట్‌గా నిలవగా, 2017 పొంగల్‌కు విడుదలైన 'శతమానం భవతి' బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. అందుకే ఈసారి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ శర్వానంద్ సంక్రాంతి సీజన్‌ను వదులుకోలేకపోతున్నాడు.
Details
సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా
'నారీ నారీ నడుమ మురారి' తరహా వినోదాన్ని తలపించేలా సంయుక్త మీనన్, సాక్షి వైద్యలతో కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'మనమేతో' ఫ్లాప్‌తో సక్సెస్ ట్రాక్ నుంచి తప్పిన శర్వానంద్‌కు ఈ సినిమా చాలా కీలకం.రవితేజ, శర్వానంద్‌లాగే హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా సంక్రాంతి సెంటిమెంట్‌గా మారింది. 2024లో విడుదలైన 'గుంటూరు కారం', 2025లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో వరుసగా రెండు సంక్రాంతి హిట్స్ నమోదు చేసిన మీనాక్షి, ఇప్పుడు 2026సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు'తో హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తోంది. ఈసినిమాలో ఇప్పటివరకు ఆమె టచ్ చేయని కామెడీ ట్రాక్‌లో కనిపించనుంది. నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తున్న ఈచిత్రంతో మీనాక్షి సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.