
టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా అప్డేట్ వచ్చింది.
టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలోని మొదటి పాటను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో రవితేజ, నుపుర్ సనన్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే టైగర్ నాగేశ్వర్ రావు నుండి మంచి మాస్ నెంబర్ రిలీజ్ కాబోతుందని అర్థమవుతుంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) September 1, 2023
An absolutly rocking number from @gvprakash you will all love ❤️ 🎶
In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AAArtsOfficial @AnupamPKher #RenuDesai @MayankOfficl @ArchanaOfficl @NupurSanon… pic.twitter.com/RTJnUKLhpM