Page Loader
రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్ 
ముంబయిలో టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 02, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని స్టువర్ట్ పురం గ్రామానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ కు వేదిక ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 3వ తేదీన ముంబై వేదికగా రిపబ్లిక్ మాల్ లో మద్యాహ్నం 12గంటల నుండి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉండనుందని మేకర్స్ వెల్లడి చేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్