Page Loader
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్ 
తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరిగా ఈ అంశంపై స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ వెటరన్ హీరో సుమన్ ఈ వివాదంపై నోరు విప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్, లడ్డూ కల్తీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో లడ్డూ కల్తీ నిజమేనని తేలితే, దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Details

తిరుమల లడ్డూ

తిరుమల దర్శనానికి వెళ్లే వారి డిక్లరేషన్ అంశం వ్యక్తిగతంగా ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. అయితే, లడ్డూ కల్తీ విషయాన్ని సామాన్యమైనదిగా తీసుకోవడం అనేది తప్పేనని, కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపించారు. టీటీడీలో అధికారుల్ని, పాలక మండలి నియామకంలో రాజకీయ నేతలకు చోటు కల్పించవద్దని కోరారు. వారిని బదులుగా భక్తి భావం ఉన్న వారిని నియమించాలని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.