70th National Film Awards: నేడే 70వ జాతీయ అవార్డు వేడుక..
70వ జాతీయ అవార్డు వేడుక నేడు (అక్టోబర్ 8) జరగనుంది.భారతీయ చిత్రసీమకు ప్రత్యేకమైన రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ చిత్ర పరిశ్రమల నుంచి కళాకారులు పాల్గొంటారు. దాదా సాహెబ్ ఫాల్కే, రాష్ట్ర అవార్డులను నేడు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించనున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరుగనుంది. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వనున్నారు. 70వ జాతీయ అవార్డులను ఆగస్టు 16న ప్రకటించారు. అవార్డుల ప్రదానోత్సవం నేడు జరుగుతుంది. ఢిల్లీలోని విజన్ భవన్‌లో సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవార్డు విజేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు
జానీ మాస్టర్ జాతీయ అవార్డును అందుకోబోతున్నాడు, అయితే అతనిపై అత్యాచారం ఆరోపణలు రావడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో అతనిని అరెస్టు చేశారు, తద్వారా జానీ మాస్టర్‌కు ఇవ్వాల్సిన జాతీయ అవార్డును ప్రభుత్వం రద్దు చేసింది.
70వ జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్న సినిమాలు ఇవే..
ఉత్తమ తెలుగు చిత్రం: కార్తికేయ-2 ఉత్తమ కన్నడ చిత్రం: కేజీఎఫ్-2 ఉత్తమ తమిళ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 ఉత్తమ మ్యూజికల్ డైరెక్టర్: రహమాన్ (పొన్నియన్ సెల్వన్-1) ఉత్తమ సౌండ్ డిజైన్: పొన్నియన్ సెల్వన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ: పొన్నియన్ సెల్వన్ ఉత్తమ సహాయనటి: నీనా గుప్తా ఉత్తమ సహాయనటుడు: పవన్ రాజ్ మల్హోత్రా ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: దీపక్ దువా (హిందీ) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: కుచ్ ఎక్స్ ప్రెస్ (గుజరాతీ), నిక్కిజోషి బెస్ట్ మ్యూజిక్: బ్రహ్మస్త్ర (హిందీ) - ప్రీతమ్ ఉత్తమ నేపథ్య సంగీతం : పొన్నియన్ సెల్వన్ 1 (తమిళ్) - మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్
70వ జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్న సినిమాలు ఇవే..
బెస్ట్ రైటర్: గుల్ మోహర్ - అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: అన్బరివు (కేజీఎఫ్ 2) బెస్ట్ కొరియోగ్రఫీ: సతీశష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళం - తమిళ్) బెస్ట్ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ) - రచయిత: నౌషద్ సదర్ ఖాన్ బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): ఆట్టం - ఆనంద్ ఏకార్షి