Page Loader
Tollywood 2023 : టాలీవుడ్'కు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీతారలు
నింగికెగసిన ప్రముఖ సినీతారలు

Tollywood 2023 : టాలీవుడ్'కు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీతారలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 13, 2023
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఏడాది మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు వంటి ముద్దుబిడ్డలు కళామ్మతల్లికి దూరమయ్యారు. ఇదే సమయంలో ఆరోగ్య కారణాల రీత్యా కొందరు కన్నుమూశారు. మరికొందరు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచారు.ఫలితంగా 2023 ఏడాది సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కె.విశ్వనాథ్ : తెలుగు సినిమాకు గౌరవాన్ని, ఔన్నత్యాన్ని తెచ్చిన దర్శక దిగ్గజం. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 3న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 92వ ఏట మరణించారు. శరత్ బాబు : హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా పేరు తెచ్చుకున్నశరత్ బాబు(71) అనారోగ్య కారణాలతో మే 22న మరణించారు. కిడ్నీ,లివర్ సమస్యలకు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.

details

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసిన చంద్రమోహన్ పరిశ్రమకు దూరయమయ్యారు

చంద్రమోహన్ : సీనియర్ నటులు చంద్రమోహన్(78) తీవ్ర అనారోగ్యంతో నవంబర్ 11న మరణించారు.షుగర్' కారణంగా బాధపడుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ : ప్రముఖ సంగీత దర్శకులు రాజ్-కోటిల ద్వయంలో ఒకరైన రాజ్(68) మే 21న గుండెపోటుతో చనిపోయారు.దశాబ్దాలుగా వెండితెరపై రాజ్-కోటి జోడి మైమరపించే బాణీలను తెలుగు ప్రేక్షకులను అందించారు. శ్రీనివాసమూర్తి : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి జనవరి 27న గుండెపోటుతో కన్నుమూశారు.సూర్య,అజిత్, మోహన్ లాల్, విక్రమ్ వంటి ప్రముఖ నటులకు ఆయన డబ్బింగ్ చెప్పారు. సాగర్: ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (73) అనారోగ్యం బారిన పడి ఫిబ్రవరి 2న మరణించారు.సుధీర్ వర్మ: సెకండ్ హ్యాండ్,కుందనపు బొమ్మ వంటి సినిమాల్లో నటించిన సుధీర్ వర్మ(34) జనవరి 24న తుదిశ్వాస విడిచారు.

details

చిన్నవయసులో ప్రాణాలు విడిచిన నటి ఆకాంక్ష దుబే

ఆర్ధిక ఇబ్బందితో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు కథనాలు వెలువడ్డాయి. మనోబాల : ప్రముఖ హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల (69) మే 3న మరణించారు. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు.ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణం విడిచారు. మయిల్ సామి: ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ సామి(57) ఫిబ్రవరి 19న ఆరోగ్య సమస్యలతో చవిపోయారు.కోలీవుడ్'కు మయిల్ సామి మరణం తీరని లోటుగా మిగిలింది. ఆకాంక్ష దుబే : భోజ్'పురి నటి ఆకాంక్ష దుబే(23) చిన్నవయసులోనే మార్చి 26న మరణించారు. ఆమెది హత్యా, లేక ఆత్మహత్య అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ : హిందీ సీరియల్ నటుడు ఆదిత్యసింగ్ రాజ్‌పుత్(32) మే22న మరణించారు.