
Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ నటి రాశి ఖన్నా గాయాల బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
ఆ చిత్రాల్లో రాశి ముక్కు నుండి రక్తం కారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ఆమె చేతులు, కాళ్లపై కూడా గాయాలు స్పష్టంగా కనిపిస్తోంది.
రాశీ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సీన్ లో పాల్గొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ప్రస్తుతం ఆమె హిందీ భాషలో రూపొందుతున్న "ఫర్జీ 2" అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇదే షూటింగ్ సందర్భంగా ఆమెకు ఈ గాయాలు జరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్
ఈ ఘటనపై స్పందిస్తూ రాశీ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది.
"కొన్ని పాత్రలు మనం చేయాలనుకోం, అవే మన చేత చేయించుకుంటాయి. కొన్ని గాయాలు కేవలం శరీరానికే కాకుండా, మన ఊపిరి మీద కూడా ప్రభావం చూపగలవు. అయినప్పటికీ, మనం తుఫానులా మారినప్పుడు, ఈ ఉరుములు, మెరుపులు మనల్ని ఆపలేవు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను" అంటూ పేర్కొంది.
ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ఫోటోలు చూసి తీవ్రంగా చలించిపోయారు. రాశీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ ఫోటోలు ఇవే..
#RaashiKhanna was injured during her shooting.She shared her pics through her social media. pic.twitter.com/yYXjk4u6xg
— Cinema Mania (@ursniresh) May 20, 2025