Page Loader
Cinemas in Theatres : ఈ వారం టాకీసుల్లో విడుదల అవుతున్న సినిమాలివే
Cinemas in Theatres : ఈ వారం టాకీసుల్లో విడుదల అవుతున్న సినిమాలివే

Cinemas in Theatres : ఈ వారం టాకీసుల్లో విడుదల అవుతున్న సినిమాలివే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 22, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఈ మేరకు ఎల్లుండి శుక్రవారం నాలుగు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. 1. ఆదికేశవ 2. కోట బొమ్మాళీ పీఎస్ 3. 'సౌండ్ పార్టీ 4. ధ్రువ నక్షత్రం సినిమాలు జాబితాలో ఉన్నాయి. అయితే వీటిలో 'ఆదికేశవకి క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ - శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. యాక్షన్ తో పాటు రొమాంటిక్ లవ్' కథాంశంలో సినిమా సాగనుంది. మరోవైపు శ్రీకాంత్ , వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రల్లో 'కోట బొమ్మాళీ పీఎస్' సైతం 24నే రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

details

టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్న ధ్రువ నక్షత్రం

మాలీవుడ్ 'నాయట్టు' సినిమాకి రీమేక్'గా తెరకెక్కింది. తేజ మార్ని దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్- 2 నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించందుకు రెడీ గా ఉంది. ఇదే సమయంలో శుక్రవారం విడుదల కానున్న మరో చిత్రం ధ్రువ నక్షత్రం. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ రూపొందించిన 'ధ్రువ నక్షత్రం' థియేటర్లకు రానుంది. ఇదే రోజున మరో సినిమా 'సౌండ్ పార్టీ' కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది. గతంలో 'బిగ్ బాస్' విజేతగా నిలిచిన వీజే సన్నీ కథానాయకుడిగా, ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హిరోయిన్'గా నటించడం విశేషం.