నెపోలియన్ మూవీ ఫేమ్ హాస్యనటుడు అల్లు రమేష్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మావిడాకులు వెబ్ సిరీస్ తో ఎంతో పేరు తెచ్చుకున్న అల్లు రమేష్, ఈరోజు కన్నుమూశారు.
విశాఖపట్నంలోని తన స్వగృహంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచారు అల్లు రమేష్. కోస్తాంధ్ర యాసలో డైలాగులు పలికే అల్లు రమేష్, తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు.
వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు రమేష్, నెపోలియన్, తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం మొదలగు చిత్రాల్లోనూ కనిపించాడు.
అల్లు రమేష్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటి రేఖ భోజ్, నటుడు ఆనంద్ రవి.. అల్లు రమేష్ మృతి పట్ల సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపం తెలియజేశారు.
Details
కానిస్టేబుల్ గా అలరించిన అల్లు రమేష్
ఆనంద్ రవి హీరోగా రూపొందిన నెపోలియన్ మూవీలో అల్లు రమేష్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించారు. నీడ పోయిందని, దేవుడు కనిపించాడని పోలీస్ స్టేషన్ చుట్టూ హీరో తిరుగుతుతాడు.
హీరో గురించి తెలుసుకోవాలని పోలీస్ ఎస్సై ప్రయత్నిస్తుంటే అతనికి హెల్ప్ చేసే పాత్రలో అల్లు రమేష్ కనిపిస్తారు.