Page Loader
Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు
తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు

Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రిగా అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆనందకర సమాచారం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ,తన బిడ్డ కాలిని ముద్దాడుతున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం,నటి రహస్య మధ్య ప్రేమగా మొదలై,వివాహ బంధంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరూ 'రాజావారు రాణిగారు' సినిమాతో కలిసి నటించారు.అనంతరం గత సంవత్సరం వివాహం చేసుకున్నారు. కాగా, 'క' చిత్రంతో కిరణ్‌ గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'కె-ర్యాంప్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్