Page Loader
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కాసేపటి క్రితమే కన్నుమూశారు. సంగీత దర్శకుడు కోటితో కలిసి రాజ్ పలు చిత్రాలకు సంగీతం అందించారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ద్వయం దశాబ్దాలపాటు తమ సంగీతంతో అలరించింది. రాజ్‌ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజ్ దాదాపు 180 సినిమాలకు పాటలందించారు. 'హలో బ్రదర్' సినిమాకు 1994లో 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్' గా రాజ్ నంది అవార్డు అందుకున్నారు. కోటి తో విడిపోయాక రాజ్ 'సిసింద్రీ', 'రాముడొచ్చాడు', 'ప్రేమంటే ఇదేరా' (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) ఇలా చాలా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి