
Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, కెమెరా మెన్ మన్నం సుధాకర్(62) కన్నుమూత.
చెన్నైలో నివాసముంటున్న సుధాకర్,మూడు నెలల క్రితం బాత్రూంలో కాలు జారీ పడ్డారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు.
సుధాకర్ పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సేవకుడు,నా మనసిస్తారా,వాలి,ఆక్రోశం,తారకరాముడు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
Details
ఇండస్ట్రీకి నూతన నటులను పరిచయం చేసిన సుధాకర్
నిర్మాతగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
సుధాకర్ కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్ బాబు, మన్నంత సతీష్ బాబు ఉన్నారు. ఈయన మరణం కంటే ముందే ఆయన కుమార్తె మన్నం స్వాతి చనిపోయారు.
మన్నం సుధాకర్ మరణ వార్తతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాకర్ అని.. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతూ సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.