NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tollywood : టాలీవుడ్ లెక్కలన్నీ తీస్తా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ
    తదుపరి వార్తా కథనం
    Tollywood : టాలీవుడ్ లెక్కలన్నీ తీస్తా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ
    సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ

    Tollywood : టాలీవుడ్ లెక్కలన్నీ తీస్తా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 19, 2023
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

    ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులు తొలిసారిగా మంత్రి కోమటిరెడ్డిని కలిశారు.

    ఇదే సమయంలో తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.

    మంత్రిగా పదవి చేపట్టాక టాలీవుడ్ నుంచి తనకి ఎలాంటి అభినందనలు రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

    నిర్మాత దిల్ రాజు మాత్రమే అభినందనలు తెలిపారని, మిగిలిన సినీ ప్రముఖులు తనని విష్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "టాలీవుడ్ లెక్కలనీ త్వరలోనే తెలుస్తా" అని ప్రెస్ మీట్'లోనే అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు పరిశ్రమలో బాగా వైరల్ అయ్యాయి.

    details

    మంత్రితో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించిన నిర్మాతలు

    ఈ మేరకు తాజాగా టాలీవుడ్' ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలుసుకుని అభినందనలు తెలియజేశారు.

    ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నిర్మాతలు, నటులు, దర్శకుల బృందం కోమటిరెడ్డిని కలిసి సన్మానించింది.

    సమావేశంలో రాఘవేంద్రరావు, సి కళ్యాణ్, సురేష్ బాబు, నట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    అయితే తొలి భేటీలో భాగంగా సినీ పరిశ్రమకి సంబంధించిన పలు సమస్యలను కొత్త మంత్రి కోమటిరెడ్డితో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

    ప్రస్తుతానికి నిర్మాతలు వచ్చి మంత్రిని కలిసిన నేపథ్యంలో తదుపరి ఇండస్ట్రీలోని అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి వాళ్లు సినిమా శాఖ మంత్రిని కలుస్తారో లేదోనని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    టాలీవుడ్

    Cinemas in Theatres : ఈ వారం టాకీసుల్లో విడుదల అవుతున్న సినిమాలివే సినిమా
    Aishwarya Rai : ఈసారి రాధా రవి వంతు.. ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేసేవాడ్ని.. వీడియో వైరల్ సినిమా
    Izzat Song : సుమ కొడుకు సినిమా సాంగ్‌ని లాంచ్ చేసిన చిరంజీవి సుమ
    Naga Chaitanya : నాగ చైతన్య 'దూత' ట్రైలర్ రిలీజ్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్బ్! నాగ చైతన్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025