Page Loader
Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే.. టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్
టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్

Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే.. టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 04, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈవారంలో టాలీవుడ్ సినిమాలు టాకీసుల్లో, ఓటిటిల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు డిసెంబరు 1న శుక్రవారం విడుదలైన 'యానిమల్‌' హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతోపాటు 'అథర్వ', 'కాలింగ్‌ సహస్ర'వంటి చిన్న సినిమాలు బాక్సాఫీసు ముందు బొనంజాగా మరింది. ఈ క్రమంలోనే ఈవారం థియేటర్‌, ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన 'హాయ్‌ నాన్న'(Hi Nanna) సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. హీరో నాని(Nani), హీరోయిన్'గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), శ్రుతిహాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 2: 05 గంటల నిడివితో రూపొందింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

details

బాలీవుడ్ ప్రముఖుల వారసుల సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.

జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నవ్వులు పంచేందుకు 'ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌'తో వస్తున్నారు నటుడు నితిన్‌ (Nithiin). శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'చండిక' వీరు, శ్రీహర్ష, కుషి చౌహన్‌, నిషా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చండిక', హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంగా డిసెంబర్‌ 8న విడుదల కానుంది. బాలీవుడ్‌ స్టార్ల వారసులు నటించిన సినిమా 'ది అర్చీస్‌' (The Archies),జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా నేరుగా ఓటిటి 'నెట్‌ఫ్లిక్స్‌'లో డిసెంబరు 7న విడుదల కానుంది. బోనీ కపూర్‌- శ్రీదేవి రెండో కుమార్తె ఖుషికపూర్‌, షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌, అమితాబ్‌ మనవడు అగస్త్య నంద తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

DETAILS

ఏఏ ప్లాట్ ఫామ్స్'లల్లో అంటే

ఆహా డిసెంబరు 8న 'మా ఊరి పొలిమేర 2': ('ఆహా గోల్డ్‌' చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో ఉండనుంది) నెట్‌ఫ్లిక్స్‌ డిసెంబరు 8న, 'జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌' (తెలుగు సహా పలు భాషల్లో) డిసెంబరు 8న లీవ్‌ ది వరల్డ్‌ బిహైండ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 8న ధక్‌ ధక్‌ (హిందీ) డిస్నీ+ హాట్‌స్టార్‌ డిసెంబరు 8న వధువు (వెబ్‌సిరీస్‌) (తెలుగు సహా పలు భాషల్లో) డిసెంబరు 8న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మస్త్‌ మే రహ్నే కా (హిందీ) జీ5 డిసెంబరు 8న కడక్‌ సింగ్‌ (హిందీ) డిసెంబరు 7న సోనీలివ్‌ చమక్‌ (వెబ్‌సిరీస్‌)