Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 02, 2024
04:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు,తమిళ చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు(62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు(మంగళవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని అయన నివాసంలో ఉంచారు. రేపు విశ్వేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయి.ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దర్శకునిగా, నిర్మాతగానూ వ్యవహరించారు.