Loading...
Toxic Movie Review : 'టాక్సిక్‌' మూవీ రివ్యూ: యశ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?
'టాక్సిక్‌' మూవీ రివ్యూ: యశ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?

Toxic Movie Review : 'టాక్సిక్‌' మూవీ రివ్యూ: యశ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 26, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కేజీఎఫ్‌' ఫ్రాంచైజీ తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్‌'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమా ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. భారీ తారాగణంతోపాటు హాలీవుడ్‌ స్థాయి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో బుధవారం విడుదలైంది. మరి ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను 'టాక్సిక్‌' అందుకుందా? యశ్‌ మరోసారి 'కేజీఎఫ్‌' మ్యాజిక్‌ను రిపీట్‌ చేశాడా? తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.

వివరాలు

కథ ఏంటంటే..

గంగా (నయనతార), రాయ (యశ్‌) అక్కాతమ్ముళ్లు. చిన్నతనంలోనే అమ్మానాన్నలకు దూరం కావడంతో గంగే రాయకు తల్లిగా మారుతుంది.

తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తమ్ముడిని పెంచి పెద్ద చేస్తుంది.

చిన్నతనం నుంచే నేర ప్రపంచంలో పెరిగిన అక్కాతమ్ముళ్లు అదే వాతావరణంలో నేర ప్రవృత్తితో ఎదుగుతారు.

గోవా నేర సామ్రాజ్యానికి తన తమ్ముడిని అధిపతిగా చూడాలనేది గంగ కోరిక.

ఇందుకోసం అప్పటికే గోవాను ఏలుతున్న ఓ మాఫియా డాన్‌తో ఆమె చేతులు కలుపుతుంది.

ఆ గ్యాంగ్‌లో రాయ కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. మాఫియా డాన్‌ కూతురు రెబెక్కా (తార సుతారియా) రాయకు దగ్గరవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.

వివరాలు

గోవా మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడా?

మరోవైపు ప్రత్యర్థుల దాడులు, ప్రతిదాడులతో కథ ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో రాయకు రాయల్‌ సర్కస్‌లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ) పరిచయమవుతుంది.

ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ క్రమంలో నాడియా గర్భవతి అవుతుంది. తన కూతురిని కాదని మరో అమ్మాయితో రాయ తిరుగుతున్నాడని తెలుసుకున్న మాఫియా డాన్‌ ఆగ్రహానికి గురవుతాడు.

అనుకోని పరిస్థితుల్లో రాయ అక్క గంగ, అతడి ప్రేయసి నాడియా శత్రువుల చేతుల్లో చిక్కుకుంటారు.

కడుపులో ఉన్న బిడ్డను చంపుతామని బెదిరించి, నాడియా చేతుల మీదుగానే గంగను దుండగులు చంపిస్తారు.

అక్క కోరిక మేరకు రాయ గోవా మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ADVERTISEMENT

వివరాలు

అక్క సెంటిమెంట్‌‌తో కథ..

కథ విషయానికి వస్తే ఇది చాలా సాధారణమైనదిగానే అనిపిస్తుంది.

'కేజీఎఫ్‌'లో నేర ప్రపంచంలో పెరిగి డాన్‌గా ఎదిగే కథను చూపించినట్టే.. 'టాక్సిక్‌'లోనూ దాదాపు అదే ధోరణిలో కథ సాగుతుంది.

అయితే అక్కడ అమ్మ సెంటిమెంట్‌ ఉంటే.. ఇందులో అక్క సెంటిమెంట్‌ ప్రధానంగా కనిపిస్తుంది.

తప్పు చేసిన ఓ తండ్రి మానసిక వేదనే ఈ సినిమా కథగా చెప్పొచ్చు.

సినిమా ఆద్యంతం నరుక్కోవడాలు, చంపుకోవడాలు, కాల్చుకోవడాలతో నిండిపోయింది.

మధ్య మధ్యలో ఇంటిమేట్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో కుటుంబ ప్రేక్షకులు కలిసి చూసే విధంగా సినిమా లేదనే చెప్పాలి.

అయితే సినిమాను దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ చాలా రిచ్‌గా, హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కించారు.

ADVERTISEMENT