
Kollywood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ప్రముఖుల వరుస మరణాలు సినిమా పరిశ్రమలో వరుస విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో మరణవార్త కోలీవుడ్‌లో చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు రామరత్నం శంకరన్ (92) కన్నుముశారు.
గురువారం ఉదయం చైన్నైలోని స్వగృహంలోని ఆయన తుదిశ్వాస విడిచారు. శంకరన్ మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
తన గురువు శంకరన్ మృతి తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు.
Details
శంకరన్ మృతి పట్ల ప్రముఖుల నివాళి
1962లో విడుదలైన 'ఆడికి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా శంకరన్ పరిచమయ్యారు.
ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్ కోట్టై చిత్రాల్లో నటించారు.
1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
తర్వాత తేన్ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్ మీన్, పెరిమై కురియవన్, వేలుమ్ మైలుమ్ తున్నై, కుమారి పెణిన్ ఉళ్లత్తిలే వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
దర్శకుడిగా 8 సినిమాలు, 50కి పైగా సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు.
అదే విధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్ మృతి పట్ల నివాళులర్పిస్తున్నారు.