Junior Balaiah Died: సినీ పరిశ్రమలో విషాదం.. బాలయ్య ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు.
దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధడపుతున్న ఆయన ఇవాళ చైన్నైలోని వలసరక్కం నివాసంలో మరణించారు.
అయన అసలు పేరు రఘు బాలయ్య. అయితే అభిమానులు ముద్దుగా జూనియర్ బాలయ్య అని పిలుస్తారు.
1975లో జూనియర్ బాలయ్య మీనాట్టు మురుమగాళ్ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించారు.
చివరిగా ఆయన అజిత్ నేరకొండ పార్వై చిత్రంలో నటించారు.
Details
ఇవాళ జూనియర్ బాలయ్య అంత్యక్రియలు
జూనియర్ బాలయ్య నటించిన చిత్రాల్లో వాసలిలే, సుందర కాండం, కుంకీ లాంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.
40 ఏళ్ల సినీ ప్రయాణంలో వందకుపైగా తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఆయన నటించాడు.
ఆయన మృతితో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జూనియర్ బాలయ్యకి కుమార్తె నివేదిత సంతానం. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి.