Krishnaveni: సినీ పరిశ్రమలో విషాదం.. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు.
ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా, గత కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణవేణి ప్రముఖులు.
ఆమె నిర్మించిన 'మనదేశం' చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. ఆ తరువాత ఆయన తన విశిష్ట నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో అసమాన చరిత్రను సృష్టించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణవేణికే దక్కింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
Details
1936లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం ప్రారంభం
కృష్ణవేణి నటిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణవేణి 1936 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించారు.
సినీ రంగంలో అడుగు పెట్టేందుకు ముందు ఆమె డ్రామా ఆర్టిస్టుగా పనిచేశారు. 1936లో 'అనసూయ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.
వైద్య వృత్తిలో ఉన్న ఆమె తండ్రి తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో 1939లో ఆమె చెన్నైకి స్థిరపడింది. తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాల్లో నటించడంతో పాటు, ఎన్నో చిత్రాలను నిర్మించారు.
Details
ప్రముఖుల సంతాపం
1939లో మీర్జాపురం జమీందారుతో వివాహం చేసుకున్న కృష్ణవేణికి అప్పట్లో 'శోభనాచల స్టూడియో' అనే నిర్మాణ సంస్థ ఉంది.
దీన్ని అనంతరం 'వీనస్ స్టూడియో'గా మార్చారు. 1949లో విడుదలైన మనదేశం సినిమా ద్వారా పలువురు సినీ ప్రముఖులను పరిశ్రమకు పరిచయం చేశారు. ః
సీనియర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, నేపథ్య గాయని పి.లీల తదితరులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన కృష్ణవేణి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.