Page Loader
MT Vasudevan Nair: మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ వాసుదేవన్ కన్నుమూత
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ వాసుదేవన్ కన్నుమూత

MT Vasudevan Nair: మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ వాసుదేవన్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2024
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. కోజికోడ్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారం, సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. 1933 జూలై 15న పాలక్కాడ్ సమీపంలోని కడలూరులో జన్మించిన వాసుదేవన్ నాయర్ చిన్నప్పటి నుంచే సాహిత్యంపై అపారమైన ఆసక్తిని కలిగి ఉన్నారు. ఆయన రాసిన నాలుకెట్టు, అసురవిత్తు, మంజు, సర్పవిత్తు వంటి రచనలు పాఠకుల మనసులను గెలుచుకున్నాయి. ఉపాధ్యాయుడిగా కొంతకాలం సేవలందించిన వాసుదేవన్ నాయర్ 1960వ దశకంలో మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.

Details

54 సినిమాలకు స్క్రీన్ ప్లే రాశారు

దాదాపు 54 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసిన ఆయన పలు చిత్రాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నిర్మాల్యం, కడవు చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు సాధించాయి. వాసుదేవన్ నాయర్ నాలుగు సార్లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డులను అందుకున్నారు. 1995లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం అందించగా, 2005లో పద్మభూషణ్‌తో గౌరవించింది. ఆయన రచనలతో మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా మలయాళ సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చారు.