Page Loader
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందాడు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్యం కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. దర్శకతర్న దాసరి నారయణరావు దర్శకత్వం వహించిన 'స్వర్గం నరకం' చిత్రం ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్రసీమకు పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ఈశ్వరరావు నంది అవార్డును అందుకున్నారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి, అందరిని మెప్పించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Details

చివరిసారిగా ఘరానా మెగుడు చిత్రంలో నటించిన ఈశ్వరరావు

ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు. అటు టీవీ సీరియళ్లలోను ఆయన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.