Page Loader
రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల
థియేటర్లలోకి మళ్ళీ వస్తున్న మగధీర

రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 23, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఈసారి రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర థియేటర్లలోకి మళ్ళీ వచ్చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, అప్పట్లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చ్ 27) సందర్భంగా మగధీర సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మగధీర సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. మిగతా ప్రధాన పాత్రల్లో దేవ్ గిల్, కీ.శే. శ్రీహరి నటించగా, సంగీతం, కీరవాణి అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మగధీర మళ్ళీ విడుదల